
జహీరాబాద్: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మణిక్ రావు జన్మదిన వేడుకలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మాణిక్ రావు జన్మదినం సందర్భంగా జహీరాబాద్ నాయకులు కేక్ కటింగ్ నిర్వహించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే మాణిక్ రావు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని, సంపూర్ణ ఆయురారోగ్యాలతో, ప్రజలకు మరిన్ని సేవలను అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్, జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.