ప్రతి ఇంటికి కేసీఆర్ ప్రవేశ పెట్టిన మేనిఫెస్టో ప్రచారం చేయాలి.

ఒక్కసారి అవకాశం కల్పిస్తే బిఆర్ఎస్ ప్రభుత్వ సహకారంతో సమగ్ర అభివృద్ధి చేసిన.

మరో సారి అవకాశం ఇవ్వండి భూపాలపల్లికి మైనింగ్ కళాశాల,మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేస్తా

నాడు ఎన్నికల ఇచ్చిన హామీలను నెరవేర్చిన

ఎన్నికల్లో ఒకరిదగ్గర కూడా ఒక్క రూపాయి ఆశించలేదు

దొంగ ఏడుపులు, అబద్ధపు వాగ్దానాలు నాకు రావు

భూపాలపల్లి పట్టణానికి ప్రత్యేక మేనిఫెస్టో ఏర్పాటు చేస్తున్నా

ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

2018 ఎన్నికల్లో భూపాలపల్లి పట్టణ ప్రజలు నామీద నమ్మకం ఉంచి ఓటు వేసిన క్రమంలో పట్టణవాసులకు కావాల్సిన ప్రతి సౌకర్యాలను తీర్చి మళ్లీ మీ ముందుకు వస్తున్నానని గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు శనివారం రోజు భూపాలపల్లి పట్టణంలోని 4,5,6,7,23,24,25,26వ వార్డుల భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా భూపాలపల్లి నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జ్ మాజీ మంత్రి ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ఏరా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ నాకు ఒక్కసారి ఓటు వేస్తే భూపాలపల్లి పట్టణంలో ప్రధాన సమస్యలుగా ఉన్న నీటి సమస్యలను తీర్చేయడం జరిగిందని నాడు ఎన్నికల హామీల్లో ఇచ్చినటువంటి మెడికల్ కాలేజ్ సింగరేణి కార్మికులకు 1000 క్వార్టర్స్ రెండు పడకల ఇండ్ల నిర్మాణాలను ప్రతి వార్డుల్లో అంతర్గత రోడ్ల నిర్మాణాలను భూపాలపల్లి పట్టణానికి నాలుగు దిక్కులుగా ఉన్న శివార్లకి స్మశాన వాటికలు ఏర్పాటును సెంట్రల్ లైటింగ్ సిస్టమని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు భూపాలపల్లి పట్టణానికి బ్రతుకుతెరువు కోసం వచ్చి ఇక్కడే స్థిరపడిన యాదవ కాలనీ కృష్ణ కాలనీ సుభాష్ కాలనీ వాసులకు ప్రభుత్వంతో మాట్లాడి సింగరేణి సంస్థలో ఉన్నటువంటి భూమిని ప్రభుత్వానికి అందజేసి ప్రత్యేక జీవం ద్వారా ఆయా కాలనీవాసులకు శాశ్వత ఇల్లా రిజిస్ట్రేషన్ పట్టాలను అందించి ఈరోజు మీ ముందుకు వచ్చానని తెలిపారు.
మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రత్యేక చొరవతో భూపాలపల్లి పట్టణంలో వందల కోట్ల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.
రానున్న ఎన్నికల సమయంలో మరోసారి అవకాశం కల్పిస్తే ఈ యొక్క ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి జిల్లాకు మైనింగ్ ఇంజనీరింగ్ కళాశాల తీసుకొస్తానని భూపాలపల్లి పట్టణానికి సమగ్ర ప్లానింగ్ ఏర్పాటు చేసి ప్రజలకు అన్ని విధాల సౌకర్యాలకు మెరుగుపడేలా చూస్తానని తెలిపారు.
నూతనంగా ఏర్పడిన జిల్లా కేంద్రంలో భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన కులాలకు వారి ఆత్మగౌరవ భావనాలకు ప్రభుత్వ స్థలాలను అందించి, రూ.10కోట్ల మేర భవన నిర్మాణాలకు నిధులను కేటాయించడం జరిగింది.
నాకు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఏ విధమైన కోపతాపాలు ఉండవు.
ప్రజలకు కావాల్సిన పనులను చేస్తా అంతే కాని అబద్ధపు మాటలు చెప్పడం రాదు.
నేను కన్నీళ్లు పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించను.
అభివృద్ధి చేసిన, అవకాశం కల్పిస్తే మరింత అభివృద్ధి చేస్తా అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వెంకటరాణి సిద్దు వైస్ చైర్మన్ కొత్త హరిబాబు శిరూప అనిల్ మేకల రజిత మల్లేష్ సజ్జనర స్వామి ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!