బడుగు బలహీన వర్గాలదళిత జాతిలో మణిరత్నం గా బాబు జగజీవన్ రామ్..
ప్రపంచంలోనే ఖ్యాతి గడించిన ఆశాజ్యోతి.
రామాయంపేట (మెదక్) నేటి ధాత్రి.
బాబు జగ్జీవన్ రామ్ ప్రపంచంలోనే ఖ్యాతి గడించిన ఆశాజ్యోతి
రామాయంపేట కాంగ్రెస్ నాయకుల ఘన నివాళి రామాయంపేట మాజీ ఎంపీపీ కాంగ్రెస్ నాయకుడు యేసు గారి రమేష్ రెడ్డి అన్నారు ఆయన బాబు జగజీవన్ రామ్33వ వర్ధంతి సందర్భంగా మెదక్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన నివాళి కార్యక్రమంలో మాట్లాడుతూ దళిత జాతిలో పుట్టి దేశ స్థాయిలో అన్ని వర్గాల కోసం పోరాటం చేసిన మహాయోధుడని ఆయన అన్నారు అంబేద్కర్ సంఘం కాంగ్రెస్ నాయకుడు బైరం కుమార్ మాట్లాడుతూ మా దళిత జాతిలో పుట్టిన ఆశాజ్యోతి ఆణిముత్యం జగజీవన్ రామ్ అన్నారు. ఆయన అన్ని వర్గాల కోసం పోరాటం చేయడమే కాకుండా దేశ చరిత్ర తమ జాతి కోసం అహర్నిశలు కృషి చేశారని ఆయన అన్నారు ఆయన కూతురు మీరా కుమారి పార్లమెంట్లో తెలంగాణ ఏర్పాటులో స్పీకర్ గా ఉండి ఎంతో సహకారంతో తెలంగాణ రావడానికి ముఖ్యకారకులు అయ్యారన్నారు. వారి కుటుంబానికి తెలంగాణ ప్రజలు ఎంతో రుణపడి ఉన్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి సుప్రభాత రావు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఏసు గారి రమేష్ రెడ్డి. అల్లాడి వెంకటి. కంభంపాటి విప్లవ కుమార్. దోమకొండ యాదగిరి. కుమార్ సాగర్. బైరం కుమార్. రొయ్యల పోచయ్య. రేవెల్లి వినయ్ సాగర్. తాకి స్వామి. ఎర్రగుళ్ల రమేష్. తొండవల్లి యాదగిరి. తదితరులు పాల్గొన్నారు