ఐటిఐ కళాశాలలో నీటి సౌకర్యం కల్పించిన మండే పల్లి గ్రామపంచాయతీ పాలకవర్గం…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో స్థానిక ఐటిఐ కళాశాలు.విద్యార్థులకు నీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతుంటే కొత్తగా ఎన్నికైన నూతన మండేపల్లి గ్రామపంచాయతీ పాలకవర్గం స్పందించి పై అధికారులతో నాయకులతో. కాంగ్రెస్ ప్రభుత్వంలోని పార్టీ నాయకులతో మాట్లాడి అధికారులకుతొవిద్యార్థులకు నీటి సౌకర్యం కల్పించాలనినీటిసౌకర్యం పై చర్చించి ప్రభుత్వ నిధుల నుండి బోరు మంజూరు చేయించి ఈరోజు బోరు వేయించడం జరిగింది. దీనిపై మండపల్లి గ్రామపంచాయతీ పాలకవర్గం ప్రత్యేక చొరవ తీసుకొని ఐటిఐ కళాశాల విద్యార్థులకు నీటి సౌకర్యం కల్పించి బోరు మంజూరు చేయించడంతో విద్యార్థులు పాలకవర్గానికి.ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ. మాకు కొన్ని రోజులుగా నీటి కష్టాలు ఉండడంతో ఈరోజు పరిష్కారం లభించడంతో.కళాశాల విద్యార్థులు అందరూ సంతోషంగా వ్యక్తం చేశారు. ఇట్టి నీటి బోరురావడానికి కృషిచేసిన మండపల్లి సర్పంచ్ గాధగోనిసాగర్. ఉప సర్పంచ్ వ్యాస సందీప్. వార్డు మే o బర్లు కోమ్మటమల్లేశం. తిమ్మానగరందేవదాస్. సింగం శశి కుమార్. మధు. గ్రామపంచాయతీ పాలకవర్గానికిప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో ప్రిన్సిపల్ కవిత కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
