
Married Woman Falls Victim to Cyber Fraud in Mandamarri
సైబర్ కేటుగాళ్ల వలలో పడిన మందమర్రి వివాహిత
మందమర్రి నేటి ధాత్రి
సైబర్ క్రైమ్ ఫై అధికారులు పలుమార్లు హెచ్చరిస్తున్న మోసపోతున్న స్థానికులు
మందమర్రి పట్టణంలో నివసిస్తున్నటువంటి వివాహిత సైబర్ కేటుగాళ్ల వల్ల లొ పడింది. తన మొబైల్ ఫోన్లో ఇంస్టాగ్రామ్ చూస్తుండగా జాబు ఆఫర్లు రావడంతో ఆ లింకును ఓపెన్ చేయగా వాట్సాప్ లో సైబర్ క్రైమ్ కేటుగాడు వివాహిత ఒకరికొకరు జాబు గురించి చర్చించుకొని ముందుగా 300 రూపాయలు ఆ కేటుగాడు వివాహితకు పంపించడం జరిగింది. దీనితో వివాహిత ఆ సైబర్ క్రైమ్ కేటుగాడిని సులువుగా నమ్మింది. ఆసరాగా తీసుకున్న సైబర్ దొంగ మాయమాటలు చెప్పి ఈ జాబులో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంతకు డబల్ డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పడంతో వివాహిత ముందుగా 5000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఆ తర్వాత సైబర్ దొంగ ఇలాంటి మాయమాటలు ఎన్నో చెప్పి 27 వేల రూపాయల దాకా ఆ వివాహిక వద్ద నుండి డబ్బులు దోచుకోవడం జరిగింది. నాలాంటి పరిస్థితి మరి ఎవరికి రాకూడదు అని తను బాధతో కుమిలిపోతుంది.
మరొక బాధాకరమైన విషయము ఏమిటి అంటే తన పిల్లల స్కూలు ఫీజు కోసం దాచుకున్న ఫీజు మొత్తాన్ని సైబర్ మోసగాడి మాయలో పడి ఆ వివాహిత పోగొట్టుకోవడం జరిగింది.