జర్నలిజానికి లెజెండ్రీ గౌరవం
మందమర్రి నేటి ధాత్రి
న్యూఢిల్లీలో మందమర్రి జర్నలిస్టులకు లెజెండ్రీ పురస్కారం.*
బాధ్యతాయుత జర్నలిజానికి జాతీయస్థాయి గుర్తింపు.*
దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా తెలుగు సాంస్కృతి–సాహితీ సేవాసమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జర్నలిజం విభాగానికి సంబంధించిన లెజెండ్రీ పురస్కారం రెండు వేల ఇరవై ఐదుకు గాను మందమర్రికి చెందిన జర్నలిస్టులు మహమ్మద్ ఖాసీం, జాడ క్రాంతికుమార్లకు అందడం విశేషంగా నిలిచింది.

ప్రాంతీయ సమస్యలను నిస్సహాయుల గొంతుగా పాలకుల చెవులకు చేర్చడం, ప్రజల కష్టసుఖాలను నిజాయితీగా ప్రజావేదికపై ఉంచడం, సమాజహితమే లక్ష్యంగా ప్రశ్నించే జర్నలిజాన్ని కొనసాగించడం ద్వారా వీరు గుర్తింపు పొందారు. వృత్తిపరమైన నిబద్ధతతో పాటు సామాజిక బాధ్యతను సమపాళ్లలో నిర్వర్తిస్తున్నారని పురస్కార కమిటీ ప్రశంసించింది.కార్యక్రమంలో భాగంగా వారు మాట్లాడుతు జర్నలిస్టులుగా మరింత బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన అవసరం ఉందని, సమాజంలో జరుగుతున్న ప్రతి అన్యాయంపై కలం ద్వారా స్పందించడమే తమ లక్ష్యమని పురస్కారం సందర్భంగా వారు పేర్కొన్నారు.

ఈ గౌరవం తమ వ్యక్తిగత విజయం కాకుండా ప్రజలకు, జర్నలిజానికి దక్కిన గౌరవమని అభిప్రాయపడ్డారు.మందమర్రి ప్రాంతానికి చెందిన ఇద్దరు జర్నలిస్టులకు జాతీయ స్థాయిలో లెజెండ్రీ పురస్కారం లభించడం స్థానిక మీడియా వర్గాల్లో హర్షాతిరేకాలను కలిగించింది. ఇది యువ జర్నలిస్టులకు ప్రేరణగా నిలవడమే కాకుండా బాధ్యతాయుత జర్నలిజానికి సజీవ ఉదాహరణగా మారిందని పలువురు అభిప్రాయపడ్డారు.
