నస్పూర్, మంచిర్యాల:
మంచిర్యాల జిల్లా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ లో మందమర్రి కోల్ బెల్ట్ ఏరియా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మంచిర్యాల లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ బెల్లంపల్లి లారీ ఓనర్స్ అసోసియేషన్ రామగుండం లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు పెద్దపల్లి లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ టీం సభ్యులు పాల్గొనడం జరిగింది.క్రిష్ణకాలనీ శాంతి స్టేడియంలో ఏర్పాటుచేసిన క్రికెట్ టోర్నమెంట్ లో 5 టీంలు పాల్గొనడం జరిగింది. ఈ యొక్క టోర్నమెంట్ లో మందమర్రి కోల్ బెల్ట్ ఏరియా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ టీమ్ మొదటి విజేతగా గెలుపొందడం జరిగింది. రన్నర్ గా మంచిర్యాల లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ టీమ్ గెలుపొందడం జరిగింది. ఈ సారి 5 అసోసియేషన్ లు మాత్రమే పాల్గొనడం జరిగింది. మళ్ళీ నిర్వహించే టోర్నమెంట్ లో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న లారీ అసోసియేషన్ లు అన్నీ కలిసి నిర్వహిస్తాం అని మంచిర్యాల జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు తెలుపడం జరిగింది. లారీలు నడిపించడమే కాదు ఆటలలో కూడా ప్రతిభ చూపిస్తామని లారీ ఓనర్స్ సభ్యులు తెలియజేశారు.