చందుర్తి, నేటిధాత్రి:
బుధవారం వెలువడిన కానిస్టేబుల్ ఫలితాలలో చందుర్తి మండలానికి చెందిన యువకులు సత్తా చాటారు.మండలంలోని మల్యాల గ్రామం నుండి ఏకంగా ఐదుగురు, చందుర్తి మండల కేంద్రం నుండి ఒకరు, ఎనగల్ గ్రామానికి చెందిన ఒకరు, నర్సింగాపూర్ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సాధించారు.మల్యాల గ్రామానికి చెందిన కొండా మనోజ్( ఏఆర్ కానిస్టేబుల్ ), అర్సం వికాస్ ( సివిల్ కానిస్టేబుల్), కట్కూరి అజయ్( ఏఆర్ కానిస్టేబుల్ ), మెరుగు ఉదయ్( టి ఎస్ ఎస్ పి కానిస్టేబుల్ ), నేదూరి విశ్రుత్ సాధించగా చందుర్తి మండల కేంద్రానికి చెందిన అక్కనపల్లి హరీష్ ( టి ఎస్ ఎస్ పి ), ఎనగల్ చంద్రశేఖర్, నర్సింగాపూర్ గ్రామానికి చెందిన పెరుక రాజేందర్, వెంగలి జలంధర్, జాగిరి ప్రశాంత్ గ్రామానికి చెందిన కానిస్టేబుల్ గా ఉద్యోగాన్ని సాధించారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ
తమ పిల్లలు పోలీసు ఉద్యోగం సాధించడం సంతోషకరంగా ఉందని అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా పిల్లలు కృషి, పట్టుదలతో కష్టపడి ఉద్యోగాన్ని సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.మండలానికి చెందిన యువకులు పెద్ద ఎత్తున పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల సాధించడం పట్ల ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, గ్రామంలోని ప్రతి యువకుడు వారిని ఆదర్శంగా తీసుకొని కష్టపడి భవిష్యత్తులో ఉన్నత స్థానాలను అధిరోహించాలని అన్నారు.