ఉత్తమ ఉద్యోగి అవార్డులు అందుకున్న మండల అధికారులు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-16T154511.268-1.wav?_=1

 

ఉత్తమ ఉద్యోగి అవార్డులు అందుకున్న మండల అధికారులు

మహాదేవపూర్ ఆగస్టు 16 (నేటి ధాత్రి)

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపురం మండలంలోనీ పలువురు అధికారులు ఉత్తమ ఉద్యోగి అవార్డులు 79 వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా శుక్రవారం రోజున జిల్లా పరిపాలన అధికారి ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది. మండలంలోని డివిజనల్ పంచాయతీ అధికారి వీరభద్రయ్య, మండల పంచాయతీ అధికారి ప్రసాద్ మరియు మహాదేవపూర్ గ్రామపంచాయతీ అధికారి కల్పన లు 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆధ్వర్యంలో ఉత్తమ ఉద్యోగి అవార్డులను తీసుకోవడం జరిగింది. అనంతరం పంచాయతీ కార్యదర్శి కల్పన మాట్లాడుతూ ఉత్తమ ఉద్యోగి అవార్డు 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో తీసుకోవడం సంతోషంగా ఉందని ప్రజలకు చేసిన సేవలు జిల్లా అధికారులు గుర్తించి అవార్డును ఇచ్చినందుకు అభినందనలు తెలియజేయడం జరిగింది.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version