
అధ్యక్షులు కాళేశ్వరం నర్సయ్య
శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండల వర్కింగ్ జర్నలిస్టులు నూతన ప్రెస్ క్లబ్ కమిటీనీ టియుడబ్లుజే (ఐజేయు) జిల్లా ఉపాధ్యక్షులు గన్ను సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రెస్ క్లబ్ కమిటీ అధ్యక్షులుగా కాళేశ్వరం నర్సయ్య, ప్రధాన కార్యదర్శి రంగు శ్రీధర్, గౌరవ అధ్యక్షులు చల్ల రాజిరెడ్డి, ముఖ్య సలహదారులుగా సీనియర్ జర్నలిస్టులు దుంపల మహేందర్ రెడ్డి, బాసాని నాగభూషణం,ఉపాధ్యక్షులుగా కొమ్ముల సతీష్ కుమార్ లను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ మండల జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని అన్నారు.తమపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్న జర్నలిస్టులకు ధన్యవాదాలు తెలిపారు. నిజం తప్పిన వ్యవస్థ పై మడమ తిప్పకుండా ప్రజలకు, ప్రభుత్వపాలకులకు వారధిగా అందర్నీ కలుపుకుని ముందుకు తీసుకుపోతామని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల జర్నలిస్టులు బలిజే వేణు, కొత్తపల్లినవీన్,మాలోతు దేవ్ సింగ్, తుడుం క్రాంతి కుమార్,కొడిమాల రాజేందర్, అంకేశ్వరపు వంశీ, చెన్నబోయిన బుచ్చిబాబు, బంక ప్రవీణ్,బాసాని మల్లికార్జున్, జక్కుల కృష్ణమూర్తి, సురేష్,గిరబోయిన రాజు,తుడుం రవిందర్,తుడుం రాజు పాల్గొన్నారు.