
చందుర్తి, నేటిధాత్రి:
చందుర్తి మండలం మల్యాల గ్రామంలో పోలీసు శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మండల స్థాయి వాలీబాల్, కబడ్డీ పోటీలను సోమవారం స్థానిక ఎస్సై సిహెచ్ శ్రీకాంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు మండల స్థాయి ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.ఇందులో భాగంగా వాలీబాల్ 10 టీంలు,కబడ్డీ 8 టీములు ఎంపిక చేయడం జరిగిందని అన్నారు. ఇందులో గెలుపొందిన ప్రధమ, ద్వితీయ టీములకు బహుమతులు అందజేసి జిల్లా స్థాయికి పంపుతామని అన్నారు.ఆసక్తిగల యువతి యువకులు క్రీడల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.