మలహార్ రావు, నేటిధాత్రి :
మండలానికి నూతనంగా వచ్చిన ఎంపీడీవో కె శ్యామ్ సుందర్ ను మండల కారోబర్లు అంత మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించి తమ సమస్యలను తెలియజేయడం జరిగింది. మండలంలో ఉన్న తమ సమస్యలను తెలిపిన అనంతరం ఎంపీడీవో వారి సమస్యలకు స్పందించి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంజరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీఓ విక్రమ్ కుమార్, మండల అధ్యక్షులు కనుకుల శ్రీకాంత్, గౌరవ అధ్యక్షులు అజ్మత్ అలీ, ప్రధాన కార్యదర్శి నారా శేఖర్, జిల్లా ఉపాధ్యక్షులు జాలిగాపు శ్రీకాంత్, విజయగిరి బాపు, అజ్మీర తిరుపతిలు తదితరులు పాల్గొన్నారు