
Mandal Education Officer Inspects Aadhaar Center in Sanugula
ఆదార్ కేంద్రాన్ని పరిశీలించిన మండల విద్యాధికారి
చందుర్తి, నేటిధాత్రి:
ప్రాథమిక పాఠశాల సనుగులలో నిర్వహిస్తున్న ఆదార్ నమోదు కేంద్రాన్ని మండల విద్యాధికారి వినయ కుమార్ సందర్శించి జరుగుతున్న విధానాన్ని పరిశీలించారు. పరిసర గ్రామాల బడి పిల్లలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు. ఇంతవరకు వంద పైన అప్డేషన్ లు అయ్యాయని ఇంకా ఎవరైనా పిల్లలు తమ ఆదార్ ని నమోదు చేసుకోకపోయినా, నవీకరణ చేసుకోకపోయినా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సనుగుల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కటుకూరి ముఖేష్, సి.ఆర్.పి ఉమ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.