
Central Education Jobs
మండల్ కమిషన్ సిఫారసుల అమలుతోనే సామాజిక న్యాయం
*నేటి ధాత్రి.
కేయూ క్యాంపస్*
మండల్ కమిషన్ సిఫారసులతోనే ఇతర వెనకబడిన తరగతులకు కేంద్ర విద్యా ఉద్యోగాలలో 27 శాతం రిజర్వేషన్లు అమలులోకి వచ్చాయని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ సుంకర జ్యోతి అభిప్రాయపడినారు, డాక్టర్ తిరునహరి శేషు ఆధ్వర్యంలో యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జరిగిన బీపీ మండల్ 107వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ప్రొఫెసర్ జ్యోతి మాట్లాడుతూ రెండవ వెనుకబడిన తరగతుల చైర్మన్ గా మండల్ కమిషన్ సిఫారసుల మేరకే ఓబీసీ లకి కేంద్ర విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు సాధ్యమైనాయని అభిప్రాయపడినారు. మండల్ కమిషన్ సిఫారసుల ప్రకారంగా కేంద్ర విద్యా ఉద్యోగాలలో 27 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి కానీ కేంద్ర విద్యా ఉద్యోగల లో ఓబీసీలకు రిజర్వేషన్లు 22 శాతానికి మించి దక్కటం లేదని అభిప్రాయపడినారు. బీసీ నాయకులు డాక్టర్ తండు నాగయ్య మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చిన ఈ ఏడు దశాబ్దాల కాలంలో కాక కలేల్కర్ కమిషన్ రిపోర్ట్ కానీ మండల్ కమిషన్ రిపోర్ట్ కానీ జస్టిస్ రోహిణి కమిషన్ రిపోర్ట్ లను అమలు చేయటానికి ప్రభుత్వాలు ముందుకు రాకపోవడం వలన ఓబీసీలకు అన్యాయం జరుగుతుందని అభిప్రాయబడినారు. మండల్ కమిషన్ నివేదికని పూర్తిస్థాయిలో అమలుపరచినప్పుడే దేశంలో సామాజిక న్యాయం సాధించబడుతుందని అభిప్రాయపడినారు. బిసి నాయకులు డాక్టర్ ఎర్రబొజ్జు రమేష్ మాట్లాడుతూ జనగణలో భాగంగా జాతి ఆధారిత కుల గణన జరగాలని కాక ఖలేల్కర్ కమిషన్ మండల్ కమిషన్లు సిఫారసు చేసినా ఆ దిశగా నిర్ణయాలు తీసుకోవటానికి ప్రభుత్వలకు ఏడు దశాబ్దాల సమయం పట్టిందంటే ఓబీసీల అభివృద్ధి సంక్షేమం పట్ల ప్రభుత్వాల వైఖరి తేటతెల్లమవుతుందని విమర్శించినారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కరుణాకర్ డాక్టర్ ఫిరోజ్ డాక్టర్ వెన్నంపల్లి విజయకుమార్ డాక్టర్ లక్ష్మీనారాయణ డాక్టర్ దాసు డాక్టర్ శ్రీలత డాక్టర్ రమేష్ డాక్టర్ స్వామి డాక్టర్ జయప్రకాశ్ డాక్టర్ తాళ్లపల్లి సంజీవ్ డాక్టర్ సదానందం డాక్టర్ కొమురయ్య, కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.