తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ గెలిపించాలని కోరుతూ ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయన పార్లమెంటు సభ్యునిగా ఉన్నప్పుడు కరీంనగర్ నియోజకవర్గానికి ఎన్నో అభివృద్ధి పనులతో పాటు మనోహరాబాద్ కరీంనగర్ రైల్వే లైను తో పాటు కరీంనగర్ స్మార్ట్ సిటీగా నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని ఉద్యమ సమయంలో కేసీఆర్ వెన్నంటి ఉండి ఎన్నో ఉద్యమాలు చేశారని అటువంటి వ్యక్తికి ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు ఇట్టి కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంపీపీ మానస రాజుపాక్స్ వైస్ చైర్మన్ వెంకటరమణారెడ్డి మాజీ ఎంపీపీ సరస్వతి జాగృతి మండల అధ్యక్షులు యూత్ నాయకులు మండల పార్టీ నాయకులు వార్డు కౌన్సిలర్లు పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
