
"Disabled Demand Pensions in Mahadevpur"
మంథని కి మందకృష్ణ రాక వికలాంగుల సమస్యలపై పోరు
**వికలాంగులకు 6000 చేనేత పింఛన్ దారులకు 4000
ఇవ్వాలని డిమాండ్**
ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి
మహాదేవపూర్ఆగస్టు19(నేటి ధాత్రి)
భూపాలపల్లి ఎమ్మార్పీఎస్ ఇంచార్జ్ మాడిపెల్లి శ్యాం బాబు మాదిగ
మహాదేవపూర్ మండలంలోని పాత్రికేయుల భవనం ముందు ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బెల్లంపల్లి సురేష్ మాదిగ ఆధ్వర్యంలో. వికలాంగుల సదస్సు నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథిగా మడిపెళ్లి శ్యాంబాబు మాట్లాడుతూ . రేపు మంథని కి మందకృష్ణ మాదిగ వస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోక .పోవడంతో వికలాంగులు వృద్ధులు వితంతువులు అధిక సంఖ్యలో మంథని కి వచ్చి సమస్యల కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు .వికలాంగుల దుర్భరమైన జీవితాలను గడుపుతున్నారని వారి పరిస్థితులు అగమ్య గోచరంగా ఉంటే ప్రభుత్వం వారి సమస్యను పట్టించుకోకపోవడం ఇచ్చిన మాటను పక్కన పెట్టడం చూస్తుంటే వికలాంగులపై చిన్న చూపు ఉన్నదని స్పష్టమవుతుందనీఇప్పటికైనా. వికలాంగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించి వికలాంగులకు 6000 వితంతువులకు చేయుత పింఛన్. వృద్ధులకు. ఒంటరి మహిళలకు .చేనేత బీడీ .గౌడన్న .లకు 4000 పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు మహాదేవపూర్ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బెల్లంపల్లి సురేష్ మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టిన విధంగా వారి సమస్యలను పరిష్కరించకుంటే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పవని. వికలాంగులు ఏకతాటిపై వచ్చి మీ ప్రభుత్వం పై వువ్వెత్తున మరో పోరాటానికి సిద్ధం అయితరని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఇన్చార్జులు దుమ్ము వెంకటేశ్వర్లు . రుద్రారపు రామచంద్రం . జిల్లా యువసేన అధ్యక్షులు మంద తిరుపతి. ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బెల్లంపల్లి సురేష్ మాదిగ వికలాంగుల మండల అధ్యక్షులు వీరగంటి సమ్మయ్య ప్రధాన కార్యదర్శి కన్నెబోయిన కొమురక్క. మాదిగ యువసేన మండల అధ్యక్షులు మంథని రవితేజ టౌన్ అధ్యక్షులు చింతకుంట్ల సదానందం ప్రధాన కార్యదర్శి లింగాల సుశాంత్ కొలుగురి శ్రీకాంత్ చింతకుంట సాయి. కోడిపాక రమేష్ .తదితరులు పాల్గొన్నారు