
Mandakrishna Madiga to Visit Zahirabad on Aug 24
వికలాంగులు మరియు చేయూత దారుల పెన్షన్ల పెంపుకై ఈనెల 24న పద్మశ్రీ మందకృష్ణ మాదిగ రాక
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఉల్లాస్ మాదిగ ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ ఇంచార్జి అధ్యక్షతన, రాయి కోటి రాయికోటి నరసింహులు వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ ల సమన్వయంతో ఎన్ కన్వెన్షన్లో హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంకు ముఖ్య అతిథులుగా ఎమ్మార్పిఎస్ జాతీయ ఉపాధ్యక్షులు, సంగారెడ్డి జిల్లా ఇంచార్జి జలదానికి నర్సింగ్ రావు మాదిగ మాట్లాడుతు.తెలంగాణలో అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుండే వికలాంగులకు రూ 4000 ఉన్న పెన్షన్ రూ.6000 చేస్తామని, అలాగే వృద్దులు వితంతువులు ఒంటరి మహిళలు మరియు ఇతర చేయూత పెన్షన్ దారుల పెన్షన్ రూ 2016 నుండి 4000 పెంచుతామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి ఓట్లు దండుకున్న కాంగ్రెస్ పార్టీ అధికారం పీఠం మీద కూర్చోగానే ఇచ్చిన హామీలను మరచిపోయి మోసం చేసిందని అందులో భాగంగానే పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జహీరాబాద్ పట్టణానికి విచేస్తున్న సందర్భంగా జహీరాబాద్ నియోజకవర్గము నుండి వికలాంగులు వృద్ధులు వితంతువులు మరియు పెన్షన్ దారులు అందరూ ప్రతి ఒక్కరు స్వచ్చందంగా తరలిరావాలని పిలుపునిచ్చారు
ఇట్టి కార్యక్రమంలో.జైరాజ్ మాదిగ న్యాల్కల్ మండల ఇంచార్జి, మైకల్ మాదిగ ఝరాసంగం మండల అధ్యక్షులు,రవికుమార్ కోహిర్ మండల అధ్యక్షులు, నిర్మల్ మాదిగ మొగుడంపల్లి మండల అధ్యక్షులు,రాజు, మనోజ్, నగేష్,యేసప్ప,రాజేందర్, సింగితం రాజు, అబ్రహం మాదిగ తదితరులు పాల్గొన్నారు,