Grand Birthday Celebrations of DCC Chief
ఘనంగా మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలి జన్మదిన వేడుకలు
మందమర్రి నేటి ధాత్రి
పీసీసీ సభ్యులు నూకల రమేష్ గారి ఆధ్వర్యంలో మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్‌సాగర్ రావు గారి జన్మదిన వేడుకలను మందమర్రి పట్టణంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా నూకల రమేష్ మాట్లాడుతూ, మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీకి సురేఖమ్మ గారు ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. ఆమె అధ్యక్షతలో జిల్లాలోని మూడు నియోజకవర్గాలను అత్యధిక మెజారిటీలతో గెలిపించడంలో ఆమె కృషి ఎంతో గొప్పదని పేర్కొన్నారు.
భారత్ జోడో యాత్ర, ఆజాద్ కి గౌరవ్ యాత్ర, రాజీవ్ సద్భావన యాత్రల సందర్భంగా ఆమె వందల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. అహర్నిశలు కార్యకర్తలకు అండగా నిలబడుతూ, పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికై నిరంతరం కృషి చేస్తున్న నాయకురాలు సురేఖమ్మ గారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ మాజీ కార్యనిర్వాహక కార్యదర్శి ఎండి ముజాహిద్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సిద్ధం జనార్దన్, సీనియర్ జిల్లా నాయకులు నర్సోజీ, యువజన కాంగ్రెస్ నాయకులు నరేందర్, రంజిత్, నవీన్, కిరణ్, సతీష్, సురేష్, అనిరుద్, సంతోష్ తదితర నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
