> గణేష్ మండపాల వివరాలను పోలీసు శాఖ వారికి అందించాలి..
> జిల్లా ఎస్పీ శ్రీ కె నరసింహ అన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా ;;నేటి ధాత్రి
పోలీసు శాఖ వారు రూపొందించిన గణేష్ మండపం నిర్వహణకు సంబంధించిన ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ అనేది కేవలం మండపం నిర్వహణ, మండపముకు సంబంధించిన సమాచారం కొరకు మాత్రమే రూపొందిం చిందని అన్నారు. . గణేష్ ఉత్సవాల నిర్వా హకులు గణేష్ విగ్రహాలను వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేయుటకు ముందు, ముందస్తు సమాచారం పోలీసుస్టేషన్ లో సమాచారం ఇవ్వాలని అందుకోసం ఏదైనా కంప్యూటర్, మొబైల్ నందు అప్లై చేసుకోవాలి అని అన్నారు. అందుకొరకు ఎచ్ టీ టీ పి ://పోలీసుపోర్టల్ . టీ ఎస్ పోలీస్ .గవర్నమెంట్ .ఇన్ అనే సైట్ నందు వివరాలు పొందు పరచి అప్లికేషన్ ను సంబంధిత పోలీస్ స్టేషన్ నందు అందించాలని సూచించారు. సామాజిక మాధ్యమాలలో వచ్చే ఎలాంటి రూమర్స్, వదంతులను నమ్మకూడదు అని ఎవ్వరికైన ఎలాంటి సందేహాలు ఉన్న సంబంధిత పోలీసు వారికి లేదా డయల్ 100 లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ 8712659360 కు సమాచారం అందించలని సూచించారు. ఈ పండుగను గణేష్ నిమజ్జన ఉత్సవాలను అందరు ఆనందోత్స వాల మధ్య శాంతియుతంగా నిర్వహించుకోవాలని సూచించారు.