
Singareni Focus on Workers’ Health
సింగరేణి కార్మికుల ఆరోగ్యంపై యాజమాన్యం ప్రత్యేక దృష్టి..
కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే సంస్థ సుభిక్షంగా ఉంటుంది…
మందమర్రి జిఎం దేవేందర్
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
సింగరేణి సంస్థలో పనిచేసే అధికారుల, కార్మికుల, వారి కుటుంబ సభ్యుల, రిటైర్డ్ కార్మికుల ఆరోగ్యంపై యాజమాన్యం ప్రత్యేక దృష్టి సాధించిందని కార్మికుల ఆరోగ్యంపై యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని మందమర్రి ఏరియా జిఎం దేవేందర్ అన్నారు. రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రిలో కార్మికుల సౌకర్యార్ధం మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఏరియా ఆసుపత్రి డివైసిఎంఓ డాక్టర్ ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించినట్లు జిఎం తెలిపారు. అనంతరం జిఎం దేవేందర్ మాట్లాడారు.

సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకత పై దృష్టి సారిస్తూనే కార్మికుల ఆరోగ్యం పై సైతం యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని, కార్మికుల ఆరోగ్యం పై తగు జాగ్రత్తలు తీసుకుంటుందని అన్నారు. కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే సంస్థ సుభిక్షంగా ఉంటుందని పేర్కొన్నారు. హైదరాబాద్ కార్పొరేట్ ఆసుపత్రుల నుండి కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్, యూరాలజిస్ట్, గ్యాస్ట్రో వైద్య నిపుణులను రామకృష్ణాపూర్ ఆస్పత్రికి ప్రత్యేకంగా రప్పించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వైద్య పరీక్షలలో సమస్యలు ఉన్నవారికి ప్రత్యేక వైద్యం అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, ఏఐటియుసి సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ, ఫిట్ సెక్రటరీలు నాగేంద్ర బట్టు, వైద్యులు,సిబ్బంది పాల్గొన్నారు.