
జైపూర్, నేటి ధాత్రి :
మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని సంక్షేమ గురుకుల పాఠశాలలో మంగళవారం రోజున 75 వ వనమహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మొక్కలను నాటడం జరిగింది. పచ్చని ప్రకృతి ప్రపంచానికి శ్రీరామరక్ష అని తలచి వనమహోత్సవ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, పచ్చని ప్రకృతి భావితరాలకు మనం ఇచ్చే గొప్ప వేల కట్టలేని ఆస్తి అని, వృక్షో రక్షతి రక్షితః అనే సూక్తిని ఎల్లప్పుడూ అందరూ ఒక బాధ్యతగా భావించి మొక్కలు నాటడం, సంరక్షించడం ప్రారంభించాలని ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోదరి రమాదేవి లక్ష్మణ్, ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్, మండల స్థాయి అధికారులు,ఎంపీటీసీ, స్థానిక నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు.