మొదటి రోజుఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు
శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండల కేంద్రంలో మొదటి రోజు ఎంగిలి పువ్వు బతుకమ్మ శ్రీ మచ్చగిరిస్వామి దేవస్థానం ,మార్కండేయ దేవస్థానంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు. తెలంగాణ పూల పండుగ బతుకమ్మ ఘనంగా, విభిన్న పువ్వులతో అంగరంగ వైభవంగాతీర్చిదిద్ది బతుకమ్మను కొలువుదీరారు బతుకమ్మ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటిరోజు ఎంగిలిపువ్వు పండుగను నిర్వహించుకున్నారు. ఎంగిలిపువ్వు బతుకమ్మను పేల్చి వాడవాడల గుండా మహిళలు సాయంత్రం సమయంలో గుడి దగ్గర మహిళలు గుమ్మగుడి ఆటపాటలతో ఓరెత్తించారు మహిళల మధ్య భాగంలో బతుకమ్మలను ఉంచి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ బతుకమ్మ చుట్టూ తిరుగుతూ కోలాహాలంగా పండుగను జరుపుకున్నారు ఈ బతుకమ్మ పండుగలో మహిళలు అధిక పాల్గొన్నారు..