శీర్షిక:అక్షరమా..!
(నేటిధాత్రి )
మనిషి తెలివిమీరిన చేష్టలు చేస్తూ… పకృతి మాతకు విఘాతం కలిగిస్తూ…
రకరకాల ఉడుపులతో వేషధారణ చేస్తూ…
మతిమాలిన మితిమీరిన తెలివితేటలతో సంస్కృతి సంప్రదాయాలను నాశనం చేస్తూ…
కాయంలో ప్రాణం పోయాక
ఒక్క క్షణం కూడా ఇంట్లో
ఉంచుకోని బంధాలు కోసం అబద్ధాలు, మోసాలు చేస్తూ…
కళేబరాలతో కల్తీ నూనెలు తయారు చేస్తూ…
రాజ్యం ఏలుతున్న
దుష్ట నికృష్టు రక్కసులను
నామరూపాలు లేకుండా
చేసే అణ్వాయుధమైపో అక్షరమా..!
గుంట నక్కల మాయతెరల వెనుక కృంగుతున్న…కనులుండీ కబోదులుగా మారుతున్న ప్రతి మనిషి లోని అజ్ఞాన తిమిరాలను సంహరణ చేసి వారి జీవితాల్లో చిరుదీపమై వెలిగేట్లు చేయి అక్షరమా..!
శ్రీమతి మంజుల పత్తిపాటి (కవయిత్రి).
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్.