రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి
నేటి ధాత్రి ;
గత శనివారం మండల కేంద్రంలోని శివారు ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మంగళవారం మృతి చెందారు. మండలంలోని మల్యాల గ్రామానికి చెందిన పోతరాజు గంగాధర్ (45) శనివారం ద్విచక్ర వాహన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాదులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాగ మంగళవారం ఉదయం మృతి చెందారు. మృతుడికి భార్య ఇద్దరు కూతుర్లు ఉన్నారు. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. అందరితో కలుపుగోలుగా ఉండే వ్యక్తి అకాల మరణం చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.