ఆన్లైన్ అపరిచిత లోన్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలి
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గంలో ని న్యాల్కల్ మండల పరిధిలో సైబర్ క్రైం, అపరిచిత ఆన్లైన్ లోన్ లకి ఆకర్షితుడై తమ బ్యాంకు ఖాతాలకి చిల్లులు పడి, తన ప్రమేయం లేకుండా నగదు కాలి అవ్వడంతో హస్పత్రి పాలైన సంఘటన మండంలో చోటుచేసుకుంది. న్యాల్కల్ మండల పరిధి నివాసి అయిన యం.అర్ శివకుమార్ అను వ్యక్తి “ధనియా ఆప్”ఆన్లైన్ లోన్ కి ఆకర్షితుడై, తీసుకున్న లోన్ కి రెట్టింపు సొమ్మును కట్టినప్పటికి, తన ప్రమేయం లేకుండా ఖాత నుండి నేరుగా నగదు కాళీ అయ్యాయని, రోజు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని, మోసపోయి మనస్తాపంతో హాస్పత్రి పాలైన సంఘటన చోటుచేసుకుంది.
