జహీరాబాద్‌లో ఘోరం.. కడుపులో దిగిన చువ్వలు..
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్‌లోని ఆదర్శనగర్‌లో నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి పడి రాజు (50) అనే కూలీకి తీవ్ర గాయాలయ్యాయి.ప్రమాదవశాత్తు కింద పడటంతో ఇనుప చువ్వలు కడుపులోకి గుచ్చుకున్నాయి. రంజోల్కు చెందిన రాజును 108 సిబ్బంది చాకచక్యంగా రక్షించారు. చువ్వలను కత్తిరించి, ప్రథమ చికిత్స అందిస్తూ జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమయానికి స్పందించిన ఈఎంటీ సంగమేశ్వర్, పైలట్ శ్రీనివాస్‌ను స్థానికులు అభినందించారు.
