
Man Dies of Heart Attack in Boppanapalli
గుండెపోటుతో వ్యక్తి మృతి
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బొప్పనపల్లి గ్రామంలో ఓ వ్యక్తి గుండెపోటుతో శనివారం మృతి చెందాడు. గ్రామానికి చెందిన కమ్మరి మహేందర్ (45) గ్రామంలో కార్పెంటర్ (వడ్రంగి) కులవృత్తి పనిచేస్తుంటాడు. అయితే గత నాలుగు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నాడు. శనివారం పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా గుండెపోటు వచ్చి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.