నల్లబెల్లి , నేటి ధాత్రి :
ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రంగాపూర్ గ్రామంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు.గ్రామస్తులు. పోలీసుల కథనం ప్రకారం. గ్రామానికి చెందిన గుర్రం సునీల్ కుమార్ (32)తన ఇంట్లో శుక్రవారం ఉదయం విద్యుత్ సరఫరా కాకపోవడంతో సంబంధించిన విద్యుత్తు తీగను సరి చేస్తుండగా ఒక తీగ విద్యుత్ పోల్ పై మరో తీగ సునీల్ కుమార్ ఛాతికి తగలడంతో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి కింద పడిపోయాడు సంఘటన గమనించిన కుటుంబ సభ్యులు గ్రామస్తులు హుటాహుటిన ప్రైవేటు వాహనంలో ములుగు జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించి సునీల్ కుమార్ మృతి చెందినట్లు పేర్కొన్నారు. మృతుడికి భార్య అనూష ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్సై రామారావు పేర్కొన్నారు.
# గ్రామంలో అలముకున్న విషాదఛాయలు.
గ్రామానికి చెందిన గుర్రం సునీల్ ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతంతో మృతి చెందడంతో కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు దీంతో గ్రామంలోని విషాద ఛాయలు అలముకున్నాయి. నిరుపేద కుటుంబానికి చెందిన సునీల్ కుమార్ మృతి చెందడంతో ఆ కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోయారని ప్రభుత్వం మృతుడు కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు..