
Man Drowns in Intoxicated State at Odel
మద్యం మత్తులో నీటిలో మునిగి వ్యక్తి మృతి..
ఓదెల (పెద్దపెల్లి జిల్లా)నేటిధాత్రి:
ఓదెల మండలం గుంపుల మానేరు వాగులో మద్యం మత్తులో మునిగి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది విషయం తెలుసుకొని సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టిన ఎస్సై దీకొండ రమేష్ ఎస్సై చెప్పిన వివరాల ప్రకారం కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం రాచపల్లి గ్రామానికి చెందిన ఆరెళ్ళి రవీందర్ (51) హమాలీ వృత్తి చేస్తున్న రవీందర్ తరచుగా మద్యం సేవించి కుటుంబ సభ్యులతో గొడవ పడేవాడని పోలీసులు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం కూడా మద్యం సేవించి ఇంటికి రావడంతో భార్య, కుమారుడు మందలించగా గుంపులలో గల రామభద్ర ఆలయ సమీపానికి వెళ్లాడు. అనంతరం తన కుమారుడికి ఫోన్ చేసి అక్కడ ఉన్నానని తెలిపాడు. కుమారుడు దిలీప్, బంధువు రాజు అక్కడికి చేరుకోగా ఒడ్డున బట్టలు ఉండగా, రవీందర్ నీటిలో కనిపించాడు. బయటకు రావాలని కుమారుడు పిలవగా ప్రమాదవశాత్తు లోతైన నీటిలో కొట్టుకుపోయాడు. వెంటనే కుమారుడు బయటకు తీసుకురాగా అప్పటికే స్పృహ తప్పి ఉండడంతో 108 అంబులెన్స్ ద్వారా జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు మృతి చెందాడని ధృవీకరించారు. ఈ ఘటనపై దిలీప్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పొత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ తెలిపారు.