తాటి వనంలో ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య
రామడుగు, నేటిధాత్రి:
తాటి వనంలో వ్యక్తి ఉరివేసుకుని
ఆత్మహత్య చేసుకున్న సంఘటన కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. రామడుగు గ్రామానికి చెందిన కావలి భూమయ్య 55 సంవత్సరాలు గత ఇరవై ఐదు సంవత్సరాల క్రితం భార్య పిల్లలతో విడిపోయి కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో మంగళవారం సాయంత్రం ఏడు గంటలకు ఇంటి నుండి బయటకు వెళ్లి బుధవారం ఉదయం ఆరు గంటల వరకు ఇంటికి రాకపోవడంతో గ్రామంలో గాలించగా తాటివనంలో కావలి భూమయ్య ఒంటరితనం తట్టుకోలేక తాగుడుకు బానిసై నమిలినారా చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోని కనిపించాడని మృతుడు భూమయ్య సోదరుడి కొడుకు కావాలి రాజు తండ్రి పోశాలు ఫిర్యాదు చేయగా పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రామడుగు ఎస్సై రాజు తెలిపారు.