భూపాలపల్లి నేటిధాత్రి
మల్లు స్వరాజ్యం వర్ధంతి సభను సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు వెలిశెట్టి రాజయ్య అధ్యక్షత నిర్వహించడం జరిగింది
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బందు సాయిలు అనంతరం మాట్లాడుతూ
తెలంగాణలోని హైద్రాబాద్ సంస్థానంలో ఫ్యూడల్ వ్యవస్థ మీద,జాగీర్దార్ మీద,రజాకార్ల రాక్షసత్వం మీద,ఆ తర్వాత భారత సైన్యం మీద, తెలంగాణలోని అసంఖ్యాకమైన స్త్రీలు – పురుషులు చేసిన తిరుగుబాటు చారిత్రాత్మకం. అదే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం,నిజాం సంస్థానంలో కనీస పౌర హక్కులు లేవు,విద్యా,వైద్య అవకాశాలు శూన్యం,ప్రజలకు ప్రాణ రక్షణ లేదు, రైతుల మీద మోయలేని పన్నుల భారం,సౌకర్యాలు శూన్యం,మధ్య యుగాలనాటి ఫ్యూడల్ అణిచివేత విధానం, లేవీ ధాన్యం వసూళ్ళు సాంఘిక,ఆర్థిక దోపిడి,ఈ ఫ్యూడల్ రాచరిక రాజ్యంలో నైజాం.నవాబు పరిపాలనలో ఎన్ని దురాఘతాలు ఎన్నోన్నో దుర్మార్గాలు స్వేచ్ఛా వాయువు లేని చీకటి రాజ్యం,కుల అణిచివేత,వెట్టిచాకిరీ,బానిస యుగాల నాటి దుర్మార్గమైనటు వంటి దోపిడీ పాలన కొనసాగు తున్నటువంటి రోజులవి.చిరుప్రాయంలో బంధూకు చేతబట్టి భూస్వాములను నైజాం రజాకార్లను తరిమికొట్టిన వీరవనిత విప్లవ ధృవతార కామ్రేడ్ మల్లు స్వరాజ్యం. అని కొనియాడారు ఈ కార్యక్రమంలో వెలిశెట్టి రాజయ్య ఎం శ్రీధర్ ఎండి రజాక్ మహేందర్ శేఖర్ ప్రీతి లక్ష్మి రజిని తదితరులు పాల్గొన్నారు