
ఇల్లందకుంటలో మల్లికార్జున ఖర్గే ఘనంగా జన్మదిన వేడుకలు
జమ్మికుంట (నేటిధాత్రి)
ఈరోజు ఇల్లంధకుంట మండల కేంద్రంలో హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వొడితల ప్రణవ్ బాబు గారి ఆదేశానుసారం అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి జన్మదిన పురస్కరించుకొని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్ది కుమార్ గారి ఆధ్వర్యంలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ప్రత్యేక అర్చనలు చేపించి వారు ఆయురారోగ్యాలతో మరియు మరెన్నో పదవులు పొందాలని పూజలు నిర్వహించి అనంతరం కేక్ కట్ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మల్లికార్జున ఖర్గే గారు కర్ణాటక రాష్ట్రంలో ఎమ్మెల్యే స్థాయి నుంచి ఒక ఎంపీగా ఒక రాజ్యసభ సభ్యుడిగా మరియు ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షునిగా తన ప్రయాణం సాగిందని కాంగ్రెస్ పార్టీ ఒక దళితుడిని ప్రతిష్టాత్మకమైన హోదాలలో నియమింపచేయడం జరిగింది అని వారు తెలిపారు కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడే పార్టీ అని తెలియజేస్తూ అటు దేశంలోనూ ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సేవలు మరియు ప్రజలకు అందిస్తున్న పథకాలు అన్నీ కూడా పేద ప్రజలకి బడుగు బలహీన వర్గాల ప్రజలకి లబ్ధి చెందే విధంగా ముందుకు వెళుతుంది యావత్ భారత దేశంలోనే కాంగ్రెస్ పార్టీ సోనియాగాంధీ మరియు రాహుల్ గాంధీ నాయకత్వంలో దళితులకు బహుజన వర్గాలకు న్యాయం చేసే విధంగా ముందుకు వెళుతుందని అన్నారు.
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేద ప్రజలకి మరియు రైతులకి మరియు విద్యార్థులకు, యువతకు ప్రతి ఒక్క పౌరునికి లబ్ధి చెందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం హర్షనీయంగా పేర్కొంటూ భావితరాలకు కూడా ఇంకా మరెన్నో సేవలు చేసేలా నాయకులకు దిశా నిర్దేశం చేయడం జరిగింది మల్లికార్జున ఖర్గే గారు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ కి నాయకులు, కార్యకర్తలు సైనికులుగా వర్ణిస్తూ వారిని రానున్న కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలలో నాయకులుగా తీర్చిదిద్దే బాధ్యత నాదే అని ఖర్గే గారని చెప్పడం జరిగింది.
ఈకార్యక్రమంలో:- గూడపు సారంగపాణి, ఎక్కటి సంజీవరెడ్డి, అన్నం ప్రవీణ్, మంకు అయిలయ్య, మోత్కూరి శ్రీనివాస్, మురహరి రాజు, దాంసాని తిరుపతి, మూడెత్తుల మల్లేష్, గురుకుంట్ల స్వామి, మ్యాడద తిరుపతి రెడ్డి, భోగం సాయి బొమ్మ శ్రీనివాస్, మారేపల్లి వంశీ, గూడెపు ఓదెలు, రాజబాబు, రెడ్డి సారంగం, పుట్ట రాజు ,ఎండి లాల్ మొహమ్మద్, గడ్డి శ్రీనివాస్, మోటపోతుల స్వామి, ఆరే రమేష్ రెడ్డి ,మూడెడ్ల రమేష్ ,తోడేటి కిషన్, బిజిగిరి శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.