"Mallareddy Students Promote Soil Testing"
రైతులకు భూసార పరీక్షల ప్రాధాన్యతను వివరించిన మల్లారెడ్డి విద్యార్థులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
హైదరాబాద్లోని మల్లారెడ్డి వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థులు కోహీర్ మండలంలోని పిచర్యాగడి గ్రామాల్లో రైతులకు భూసార పరీక్షల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. పంట పొలాలకు భూసార పరీక్షలు చేయించడం ద్వారా అవసరమయ్యే పోషకాలను సమతుల్యంగా అందించి అధిక దిగుబడులు సాధించవచ్చని సూచించారు. మట్టి నమూనాల సేకరణ, పరీక్షా విధానం, ఎరువుల వాడకం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. నేలలోని పోషకాల నిష్పత్తిని తెలుసుకుని, సరైన మోతాదులో అందించడం ద్వారా మొక్కల ఎదుగుదల, దిగుబడి పెరుగుతుందని తెలిపారు.
రైతులు పంటలు సాగు చేసే ముందు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకోవాలని గట్టిగా సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రవికిరణ్, కార్యదర్శి అశ్వినీ,విద్యార్థులు, స్థానిక రైతులు పాల్గొన్నారు.
