మల్లాపూర్ నీ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా

– ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

కాప్రా నేటిధాత్రి 07:

మల్లాపూర్ నీ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా అని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి  అన్నారు.
మంగళవారం ఓల్డ్ మల్లాపూర్ ఇదమ్మ టెంపుల్ వద్ద 60 లక్ష ల రూపాయలతో సీ సీ రోడ్ నిర్మాణానికి స్థానిక కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి తో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏఈ స్రవంతి, బీఆర్ఎస్  పార్టీ నాయకులు కార్యకర్తలు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!