Awareness on “Dai Akshar” Letter Writing Contest
మల్లాపూర్ నేటి ధాత్రి
మల్లాపూర్ మండల్ ముత్యంపేట్ ఎస్ ఓ ఉపతపాలాధికారి యెన్నం శ్రీనివాస్ సబ్‌స్టాఫ్ భూమయ్య చంద్రమౌళి కలిసి ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి, జాతీయ స్థాయి “ధై అక్షర్” లేఖ రచన పోటీ గురించి విద్యార్థులకు ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి సంవత్సరం పోస్టు విభాగం నిర్వహించే ఈ పోటీలో పాల్గొనడానికి ప్రోత్సహించారు.
ప్రతి విభాగంలో రాష్ట్ర స్థాయిలో ముగ్గురు ఎంపికైన విజేతలకు నగదు బహుమతులు ఇవ్వబడతాయి.
ఈ అవకాశాన్ని వినియోగించుకొని లేఖ రచన నైపుణ్యాలు మరియు జ్ఞానం అభివృద్ధి చేసుకోవాలని ఉపతపాలాధికారి యెన్నం శ్రీనివాస్ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు తెలిపారు.
