
రామాయంపేట(మెదక్) నేటి ధాత్రి.
రామాయంపేట మండల కేంద్రంలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో చోరీ జరిగింది. 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న మల్లన్న గుట్ట వద్ద మల్లన్న స్వామి ,రేణుక ఎల్లమ్మ దేవాలయంలో అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయం ప్రధాన ద్వారం తాళాలు ధ్వంసం చేసి లోనికి చొరబడిన దొంగలు సీసీ కెమెరాలు ధ్వంసం చేసి ఆలయంలోకి చొరబడిన దొంగలు రెండు హుండీలను ఎత్తుకెళ్లి పక్కన అందులోని నగదును చోరీ చేసి పారిపోయారు. సుమారు 50 వేల మేర నగదు మొక్కులను ఎత్తుకెళ్లినట్టు ఆలయ నిర్వాహకులు తెలిపారు. జాతీయ రహదారి పక్కన ఉండడంతో గతంలో కూడా ఈ ఆలయంలో చోరీ జరిగినట్టు ఆలయ నిర్వాహకులు తెలిపారు ఇప్పటికైనా అధికారులు స్పందించి గస్తీ ఏర్పాటు చేసి దొంగలను పట్టుకోవాలని కోరుతున్నారు