
Temple
మల్లక్కపేట భక్తాంజనేయస్వామి ఆలయ హుండీ లెక్కింపు
పరకాల నేటిధాత్రి
హన్మకొండ జిల్లా పరకాల మండలంలోని మల్లక్కపేట గ్రామంలోగల శ్రీభక్తంజనేయ స్వామి దేవస్థానంలో శుక్రవారం రోజున ఆలయ హుండీలను ఆలయ చైర్మన్ అంబీరు మహేందర్ మరియు ఆలయ ఈఓ వెంకటయ్య,ఇన్స్పెక్టర్ ఆర్.అనిల్ కుమార్ పర్యవేక్షణలో లెక్కించడం జరిగింది.ఆరునెలల వ్యవది గల రెండు హుండీలను లెక్కించగా 82355 రూపాయలు ఆలయ కమిటీ తెలిపారు.ఈ సందర్బంగా ఆలయ కమిటీ చైర్మన్ మహేందర్ మాట్లాడుతూ గతంలో కంటే ఈసారి ఆలయ ఆదాయం పెరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో శరత్ అయ్యగారు,ధర్మకర్తలు దొమ్మటి శంకరయ్య,దావు జ్యోతి,చిట్టిరెడ్డి రాజిరెడ్డి,బిళ్ళ రాజిరెడ్డి,నిట్టే బాలరాజు,సిబ్బంది పాల్గొన్నారు.