మల్కాజిగిరి నాదే!

https://epaper.netidhatri.com/

`మురళీదర్‌ రావు మనసులో మాట.

`బిజేపి నుంచి పోటీ చేసేది నేనే.

`గెలిచేది కూడా నేనే.

`ఏ పార్టీ అయినా ఓడిపోవడానికి సిద్దపడే నాపై పోటీకి రావాల్సిందే.

`నన్ను వ్యతిరేకించే వాళ్లు లేరు.

`ఆశావహులు వుండడం సహజం.

`మల్కాజిగిరి మినీ ఇండియా.

`నన్ను గుర్తుపట్టని వారు వుండరు.

`దేశంలో అన్ని రాష్ట్రాలలో నేను తెలుసు.

`అక్కడి నుంచి వచ్చి మల్కాజిగిరిలో వున్నవాళ్ల ఓట్లు నాకే.

`పార్టీలో రాష్ట్రం నుంచి నాకంటే పెద్ద వాళ్లు లేరు.

`ఎవరూ నా కన్నా సీనియర్లు కాదు.

`మినుగురు పురుగుల ఆశలు నెరవేరవు.

`పార్టీ కోసం వచ్చిన వాళ్లు ఎవరు?

`పదవుల కోసం వచ్చిన వాళ్లు ఎవరు?

`పార్టీ పెద్దలకు అంతా తెలుసు.

`అనేక రాష్ట్రాలలో పార్టీ గెలుపుకు పని చేసిన అనుభవం నాది.

`తెలంగాణలో పది సీట్లు బిజేపి గెలవాలి.

`అదే నా లక్ష్యం..

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ముక్కు సూటి తనానికి నిదర్శనం. నిర్మొహమాటానికి నిలువెత్తు సాక్ష్యం. మంచి తనానికి సొంతం ఆయన వ్యక్తిత్వం. నమ్మిన సిద్దాంతం కోసం ఎంత దూరమైనా వెళ్లేంత ధైర్యం. వ్యవస్ధకోసం తప్ప వ్యక్తిగతంగా తనకోసం ఏనాడు ఆలోచించని నాయకత్వం. భారతీయ జనతా పార్టీకోసం ముప్పై ఏళ్లుగా సేవ చేస్తున్న త్యాగ గుణం. దేశమంతా పార్టీ బలోపేతం కావడంలో ప్రత్యక్ష కార్యదక్షతే పనితనం. ఆయన ఏ రాష్ట్రంలో పని చేస్తే ఆ రాష్ట్రంలో బిజపి పెరిగింది. ఎదిగింది. అదికారంలోకి వచ్చింది. ఎదురులేని శక్తిగా మారింది. తిరుగులేని శక్తిగా అవతరించింది. కాంగ్రెస్‌కు ఊపిరి లేకుండా చేసింది. మైదానంలో కాంగ్రెస్‌ తుడిచిపెట్టుకుపోయింది. ఉత్తరాధిన కాషాయ జెండా రెపరెపలాడుతోంది. రెండు సీట్ల నుంచి మూడొందల సీట్లుకు బిజేపి పెరిగింది. ఏకంగా వరుసగా రెండుసార్లు కేంద్రంలో బిజేపి అధికారంలోకి వచ్చింది. ముచ్చటగా మూడోసారి బిజేపి దేశాన్ని పాలించే శక్తిగా కొత్త శకం సృష్టించబోతోంది. ఇందులో తన పాత్ర ఎంతో కీలకమైనా, తానేప్పుడు తన గొప్పదనాన్ని చెప్పుకోడు. పార్టీ కోసం మాత్రం నిర్విరామంగా ఎంతైనా పని చేయగలడు. పార్టీ అంటే ఆయనకు అంత ఇష్టం. పార్టీ అంటే ఆయనకు అంత ప్రాణం. పార్టీయే ఆయన సర్వస్వం. పార్టీకోసమే ఆయన జీవితం అంకితం. ఆయనే మురళీధర్‌రావు. ఇప్పటి తరానికి ఆయన కొంత వరకు తెలియకపోవచ్చు. కాని బిజేపి శ్రేణులకు మాత్రం ఆయన బాగా తెలుసు. ఆయన జీవితం ఆదర్శంగా ఎంతో మంది యువత బిజేపిలో చేరుతున్నారు. మురళీధర్‌రావు లాగా పార్టీ కోసం పనిచేసేందుకు కంకణం కట్టుకున్నారు.
పార్టీకోసం ఆయన ప్రాణాలను కూడా ఫణంగా పెట్టిన సందర్భం వుంది.
అంటే ఇక జీవితం అన్నది మొత్తం బీజేపి మయం చేసుకొని, మునిలా పార్టీ కోసం యజ్ఞం చేస్తున్న అతి కొద్ది మంది నాయకుల్లో మురళీధర్‌రావు ఒకరు. విద్యార్ధి రాజకీయాలతో అఖిలభారత విద్యార్ధి పరిషత్‌ నుంచి ఆరెస్సెస్‌ దాకా అక్కడి నుంచి బిజేపి దాకా ఆయన ప్రస్తానం ఒక ఒక గ్రంధం. బిజేపిలో చేరాలనుకునేవారికి నిఘంటువుతో సమానం. ఆరెస్సెస్‌ లాంటి సంస్ధ ఆయనను వ్యక్తిగా దత్తత తీసుకున్నంత గొప్పగా ఆదరించిందంటే మురళీదర్‌రావు వ్యక్తిత్వం, ఆయన పోరాట పటిమ ఎంత గొప్పదో అర్ధం చేసుకోవచ్చు. ఒక దశలో కేవలం పార్టీ పరంగా నక్సలైట్లకు టార్గెట్‌ అయితే దమ్ముంటే చంపమని సవాలు విసిరిన నాయకుడు మురళీధర్‌రావు. అంతటి గుండెధైర్యం ఆయన సొంతం. అలాంటి నాయకుడు ప్రత్యక్ష రాజకీయాలలో లేకపోవడం అన్నది తెలంగాణ ప్రజలకు తీరని లోటనే చెప్పాలి. అందుకే ఈసారి ఎలాగైనా ఆయన ఎలాగైనా పోటీ చేయాలని గత కొన్ని సంవత్సరాలుగా ఆయన అభిమానులు ఎంతో ఒత్తిడిచేస్తున్నారు. దాంతో ఈసారి ఎలాగైనా పోటీ చేయాలని ఆయన కూడా నిర్ణయం తీసుకున్నారు. మల్కాజిగిరి నుంచిపోటీ చేసుందుకు మూడు సంవత్సరాలుగా తన పని తాను చేసుకుంటూ, బిజేపి బలోపేతానికి కృషి చేస్తున్నాడు. ఇంటగెలిచి రచ్చ గెలవాలని అందరూ అంటారు. కాని రచ్చ గెలిచిన మురళీధర్‌రావు ఇంట గెలవాలని అందరూ కోరుకుంటున్నారు. అందుకే ఎప్పుడూ తన వ్యక్తి గత రాజకీయాల మీద మౌనమునిగా వుండే మురళీధర్‌ రావు మూడేళ్లుగా మాట్లాడుతున్నారు. తన రాజకీయం గురించి గళం విప్పుతున్నాడు. తన మనసులో మాటను కూడా వ్యక్తం చేస్తున్నాడు. నిజానికి ఆయన ముక్కుసూటి మనిషి. తన మనసులో ఏది అనిపిస్తే అది మొహమాటం లేకుండా చెప్పేస్తాడు. కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడతాడు. పార్టీ విషయంలోనూ అయినా సరే పార్టీ బలం ఎప్పుడు ఎలా వుందనేదాన్ని ఆయన విశ్లేషించినంతగా ఎవరూ విశ్లేషించలేరు. దాగుడు మూతలకు తావుండదు. ఎవరినో నమ్మించాలన్న ఆలోచన ఆయనలో ఎప్పుడూ వుండదు. నిజం ఎప్పుడూ చేదుగానే వుంటుంది. అయినా అది మందులా పనిచేస్తుందని నమ్మే నాయకడు మురళీధర్‌రావు. అందుకే ఆయన నిజానికి నిదర్శనంగా మారారు.
ఈసారి ఆయన మాల్కాజిగిరి నుంచి బిజేపి అభ్యర్ధిగా పోటీ చేసేందుకు సిద్దమయ్యారు.
ఒక రకంగా చెప్పాలంటే నిర్ణయం తీసుకున్నారు. ఒక్కసారి మురళీదర్‌రావు నిర్ణయం తీసుకుంటే వెనకడుగు వేసిన సందర్భంలేదు. అలా వెనకుడుగు వేసే ప్రసక్తి లేదు. తన సుధీర్ఘమైన రాజకీయ జీవితంల మొదటిసారి ఆయన చట్టసభల్లో అడుగుపెట్టాలని అనుకుంటున్నారు. పార్టీ కోసం ఇంత కాలం ఆయన చేసిన సేవలకు జాతీయ స్దాయి పెద్దల సూచనల మేరకు మల్కాజిగిరిలో పోటీ చేయడానికి అన్నీ ఇప్పటీకే సిద్దంచేసుకున్నారు. అభ్యర్ధుల ప్రకటన కోసం మురళీదర్‌ రావు ఎదురుచూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మల్కాజిగిరి గురించి ఇటీవల అనేక వార్తలు వస్తున్నాయి. దాంతో మల్కాజిగిరి నాదే..పోటీ చేసేది నేనే..గెలిచేది నేనే అని మురళీధర్‌రావు ప్రకటించడం సంచలనం సృష్టించింది. ఇదే బిజేపిలోని అన్ని శ్రేణులు అనుసరించాల్సి వుంది. అప్పుడు క్యాడర్‌కు కొండంత బలం వస్తుందని చెప్పడంలో సందేహం లేదు. నేను మల్కాజిగిరి నుంచి పోటీ చేయడం పక్కా..ఇందులో రెండో ఆలోచన లేదు. అని ఎప్పుడో ప్రకటించారు. జాతీయ రాజకీయాలలో ఆయనకు వున్న అనుభవంతో ఇప్పటికే అనేకసార్లు మల్కాజిగిరిని చుట్టేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన ప్రతి గడపను ఇప్పటికే తట్టారు. అయితే ఆయన ఇంత స్పష్టత ఇచ్చిన తర్వాత కూడా కొంత మంది నాయకులు డిల్లీకి చక్కర్లు కొడుతున్నారు. పైరవీల మీద పైరవీలు చేస్తున్నారు. అసలు జాతీయ ప్రధానకార్యదర్శిగా వున్న మురళీదర్‌రావు మొదటిసారి పోటీ చేయాలనుకున్న తర్వాత తిరుగుంటుందా? ఎదురుంటుందా? అన్న ఆలోచన కూడా లేకుండా కొందరు తమకు తాము అతిగా ఊహించుకొని లేనిపోని కుంపట్లు రగిలిస్తున్నారు.
ఎలాగైనా నేనే పోటీ చేస్తున్నా అని మురళీధర్‌ రావు ఇంత స్పష్టత ఇచ్చిన తర్వాత కూడా ప్రయత్నాలు చేస్తున్నవాళ్లు, మల్కాజిగిరి నుంచి పోటీచేస్తామంటూ లేని పోని ప్రకటనలు చేస్తున్నవాళ్లు కూడా వున్నారు.
వాళ్లు పార్టీ కోసం పనిచేస్తున్నారా? లేక వ్యక్తిగత రాజకీయం కోసం పనిచేస్తున్నారా? అన్నది ఇక్కడే తేలిపోతోంది. మురళీదర్‌రావు లాంటి వారు మూడేళ్లుగా పార్టీని ఇంటింటికీ చేర్చుకునే పనిలో వుంటే, కొందరు ప్యారాచూట్‌నేతలు మేం పోటీ చేస్తామని ప్రకటించుకోవడం విడ్డూరం. అలాంటి వాళ్ల రాజకీయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే మురళీధర్‌రావు ఎప్పుడూ చెప్పే మాట ఒకటే. నేను వ్యక్తిగత రాజకీయాలకు వ్యతిరేకం. పార్టీ పరమైన రాజకీయాలకే పరిమితం. జీవితం అంకితం. ముప్పై ఏళ్ల రాజకీయ జీవితంలో ఆయన ఏనాడు పదవుల కోసం ఆలోచించలేదు. పదవుల కోసం ఆరాపటపడలేదు. పార్టీ లైన్‌ దాటలేదు. పార్టీ చెప్పిన పనులు చేసుకుంటూ వెళ్లడం మాత్రమే మురళీదర్‌రావుకు తెలుసు. అందుకే ఆయనను ఇంతా కాలం పార్టీ జాతీయ రాజకీయాలకు ఉపయోగించుకున్నది. ఇప్పుడు కూడా ఆయన పార్టీ ఇచ్చిన ఆదేశాలనే పాటిస్తున్నాడు. అచరిస్తున్నాడు. పార్టీ ఇచ్చిన అవకాశం మేరకే మల్కాజిగిరి నుంచి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయం పార్టీలోని అందరికీ తెలుసు. అయినా తెలియనట్లు నటిస్తూ మరళీధర్‌రావుకే ఎదురెళ్లాలని చూస్తున్నారు. నిజానికి మురళీధర్‌రావు ప్రజల మనిషి. ఉద్యమ కారుడిగా విద్యార్ధి దశ నుంచి రాజకీయాలలో ఎదిగిన నాయకుడు. ఎప్పుడూ ప్రజలకు చేరువగా వుండే నాయకుడు. ప్రజల అవసరాలు, సామాన్యుల కష్టాలు తెలిసిన నాయకుడు. ఎందుకంటే ఆయన కాశ్మీర్‌నుంచి కన్యాకుమారి దాకా ప్రజల సమస్యలు చూసిన అతి కొద్ది మంది నాయకుల్లో ఒకరు. అలాంటి నాయకుడైన మరళీధర్‌రావుకు తెలంగాణలో ఎలాగైనా ఆసారి బిజేపికి పది సీట్లు సంపాదించిపెట్టాలన్న ఆలోచనతోనే ముందుకు సాగుతున్నాడు. అందులో మల్కాజిగిరి నుంచి పోటీ చేసి, తాను కూడా గెలవాలన్న కసితో పనిచేస్తున్నాడు. క్షేత్ర స్ధాయిలో పనులు ఆయన ఎప్పుడో మొదలుపెట్టారు. ఆయన లెక్కలు ఆయనకు వున్నాయి. గెలుస్తానన్న నమ్మకాలు కూడా బలంగా వున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!