మల్కాజిగిరి
02 నవంబర్
బిఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి అసెంబ్లీ నియోజక వర్గ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో లక్ష్మీ సాయి గార్డెన్ మల్కాజిగిరిలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు మల్కాజిగిరి సర్కిల్ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జీ జితేందర్ రెడ్డి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్థిక ,వైద్య అరోగ్య శాఖా మంత్రి తన్నీరు హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరైనారు.మల్కాజ్ గిరి అసెంబ్లీ నియోజక వర్గం లో బిఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులతో ప్రజా ఆశీర్వాద సభను విజయవంతంగా నిర్వహించారు.ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ఇక్కడ ఎన్నికలు మంచి మనసున్న మనిషి, మాటలు,ముఠాల మనిషి మధ్య పోటీ జరుగుతుందని అన్నారు.మైనంపల్లి స్వార్థం కోసం పార్టీ మారాడు అని మెదక్,మల్కాజగిరి రెండు చోట్ల ఓడటం ఖాయం అని తెలిపారు.మర్రి రాజశేఖర్ రెడ్డి ఎంపిగా ఓడినా ప్రజాసేవ మరచిపోలేదు అని 9 ఏళ్ల తెలంగాణలో కరువు లేదు కర్ఫ్యూ లేదు సీఎం ప్రతి ఇంటికి నీళ్ళు,ఇన్వర్టర్ లేదు,కన్వర్టర్ లేదు అని అన్నారు.ప్రతి పేదింటి ఆడ బిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ లో ఇచ్చి పేద ప్రజలకు మేలు చేస్తున్నారని తెలిపారు.కాంగ్రెస్ పాలిస్తున్న కర్ణాటకలో కరెంట్ కోతలు, రైతులు ఇబ్బంది పడుతున్నారు అని,కెసిఆర్ చేతిలో తెలంగాణ ఉంటే ప్రశాంతంగా ఉంటుంది అని అన్నారు.తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశంలో ఎక్కడ అయినా ఉన్నాయా ప్రతిపక్షాలు చెప్పాలని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ పాలనలో నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన అంటే, నేడు పోదాం పద సర్కారు దవాఖాన అని పరిస్థితి ఏర్పడింది బిఆర్ఎస్ ప్రభుత్వం వల్లే అని అన్నారు.మల్కాజ్ గిరి ప్రజలకు సీఎం 1000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కట్టిస్తున్నరు అని,అందులోనే 250 పడకల మాతా శిశు సంరక్షణ కేంద్రాలు ఉంటాయని అన్నారు.28 రోజులు కష్టపడి రాజశేఖర్ రెడ్డిని గెలిపించండి.నేను మల్కాజిగిరి నియోజకవర్గం దత్తత తీసుకొని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానని సభలో తెలియజేశారు.మర్రి రాజశేఖర్ రెడ్డి ని లక్ష మెజారిటీతో గెలిపించాలని హరీష్ రావు ప్రజలను కోరారు.అనంతరం కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ అరుంధతి ఆసుపత్రి పేరుతో ఎంతోమందికి సేవలందిస్తున్న మర్రి రాజశేఖర్ రెడ్డి నీ గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఎల్ల వేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు. అదే విధంగా నియోజక వర్గాన్ని మోడల్ మల్కాజిగిరి గా తీర్చి దిద్దుత అని హామీ ఇచ్చారు. మల్కాజిగిరి అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని స్పష్టం చేశారు. కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు.అభివృద్ధి సంక్షేమ పథకాలు అందరికీ అందేలా భాధ్యత తీసుకుంటా అని తెలిపారు.ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ఎన్నికల ఇంచార్జీ,ఎమ్మెల్సీ శంబీ పూర్ రాజు ,ఎంబీసీ చైర్మన్ నంది కంటి శ్రీధర్ , సీనియర్ నాయకులు మల్కాజిగిరి సర్కిల్ పార్టీ ఎన్నికల ఇంచార్జీ జితేందర్ రెడ్డి, బద్ధం పరశురాం రెడ్డి ,కార్పొరేటర్లు, సునీత రాము యాదవ్,మీన ఉపేందర్ రెడ్డి,విజయ శాంతి శ్రీనివాస్ రెడ్డి , సబితా అనిల్ కిషోర్,మాజీ కార్పొరటర్లు జగదీష్ గౌడ్,మూరుగేశ్,అకుల నర్సింగ్ రావు,జేఏసీ వెంకన్న సీనియర్ నాయకులు అమీనుద్దీన్ డోలి రమేష్, వరావుల అంజయ్య, ఖలీల్, ఢిల్లీ పరమేష్,యోగానంద,పవన్ సత్య నారాయణ తదితరులు పాల్గొన్నారు.