*జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్
బోయినిపల్లి, నేటి ధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంలో సాధారణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున గురువారం రోజున జిల్లా ఎస్పీ బోయినిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొదురుపాక చెక్ పోస్ట్ తనిఖీ చేసి వాహన తనిఖీలు చేసి వాహనాలను నమోదు చేసిన రిజిస్టర్ ను పరిశీలించడంతో పాటు, ప్రత్యక్షంగా పోలీస్ సిబ్బంది వాహనాలు తనిఖీలు చేస్తున్న తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. తనిఖీల సమయంలో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహారించందంతో పాటు, వాహనాలను క్షుణ్ణముగా తనిఖీ చేసి అక్రమ నగదు, మద్యం రవాణాను అరికట్టాలని సూచించారు. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి డబ్బులు, మద్యం, ఇతర విలువైన వస్తువులు తీసుకొని వెళ్తున్నట్లు సమాచారం ఉంటే డయల్ 100 కి లేదా సంబంధిత పోలీస్ స్టేషన్ వారికి సమాచారం అందించాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు ఎవరైనా పాల్పడిన, ఎన్నికల నియమావళి ప్రకారం ప్రకారం చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు..
వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ ని డిఎస్పీ నాగేంద్రచరి తో కలసి పరిశీలించి విధుల్లో ఉన్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని,స్ట్రాంగ్ రూమ్ ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించారు.ఎస్పీ వెంట డీఎస్పీ నాగేంద్రచరి ,చెక్ పోస్ట్ సిబ్బంది ఉన్నారు.