
శాంతియుతంగా ఎమ్మెల్యే కార్యాలయానికి ముట్టడించిన మాలమహానాడు నాయకులు
జీవో 99గురించి అసెంబ్లీలో చర్చించాలని వినతిపత్రం అందజేత
పరకాల నేటిధాత్రి
జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ పిలుపుమేరకు ఎస్సీ వర్గీకరణలో భాగంగా గ్రూప్ 3 లో ఉన్న 26 కులాల మాలలకు అన్యాయం చేసే విధంగా జీవో 99లో భాగమైన ఎమ్మెల్యేలను ఇట్టి జీవో 99 పై పునరాలోచన చేసి అసెంబ్లీలో చర్చించి మాలలకు న్యాయం చేకూర్చలని సోమవారం జాతీయ మాల మహానాడు పరకాల నియోజకవర్గ ఇన్చార్జ్ మరియు పరకాల పట్టణ అధ్యక్షులు బండారి గిరి ప్రసాద్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని శాంతియుతంగా ముట్టడి కార్యక్రమం చేపట్టారు.ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అందుబాటులో లేని సందర్భంగా స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్ రాజి రెడ్డికి మరియు పట్టణ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్ కి వినతిపత్రం అందజేసి జీవో 99పై పునరాలోచన చేసేవిధంగా సమాచారాన్ని అందజేయాలనీ కోరారు.ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధికార ప్రతినిధి నీరటి రాములు,రాష్ట్ర కార్యదర్శి తుప్పరి నరసింహస్వామి,జిల్లా నాయకులు పసుల లక్ష్మీనారాయణ,గీసుకొండ మండల అధ్యక్షులు నాంపల్లి శ్రీనివాస్,ఆత్మకూరు మండల ఉపాధ్యక్షులు న్యాతకాని వనం,మాల మహానాడు నాయకుడు దుబాసి వెంకటస్వామి,జిల్లా నాయకులు తుప్పరి నర్సింగా రావు,పరకాల పట్టణ మాల మహానాడు ఉపాధ్యక్షులు బండారినాగార్జున,అంకేశ్వరపు అజయ్ తదితరులు పాల్గొన్నారు.