Mala Mahanadu Leaders Leave for “Hello Mala Chalo Delhi”
హలో మాల చలో ఢిల్లీకి బయలుదేరిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాల మహానాడు నాయకులు
కరీంనగర్, నేటిధాత్రి:
జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ పిలుపు మేరకు మాలల రాజ్యాంగ హక్కుల సాధన కోసం హలో మాల చలో ఢిల్లీ కార్యక్రమం నవంబర్26న జరిగే కార్యక్రమంలో పాల్గొనడానికి కదిలిన మాలమహానాడు నాయకులు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మాలలపై జరుగుతున్న అక్రమాలను నిలదీస్తూ రాజ్యాంగ విరుద్ధంగా జీవో99 రోస్టర్ విధానాన్ని తిరిగి పునః సమీక్షించాలని, అలాగే ఎస్సీ రిజర్వేషన్ పదిహేను నుంచి ఇరవై శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తూ నూతన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని, భారత కరెన్సీ నోట్లపై అంబేద్కర్ చిత్రం ముద్రించాలని, దేశంలో ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి ప్రత్యేక చట్టం తీసుకురావాలని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంలో 41సిఆర్పి సెక్షన్ ద్వారా నిందితులను అరెస్టు చేసే అవకాశం లేకుండా పోతుందని, వెంటనే 41సిఆర్పి సెక్షన్ రద్దు చేయాలని, ఇలాంటి పన్నేండు అంశాలతో కూడిన డిమాండ్ల నేరవేర్చడానికి ఈకార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. చలో ఢిల్లీ కార్యక్రమానికి బయలుదేరిన వారిలో జాతీయ మాలమాహనాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి అంజయ్య, కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్నె రాజు, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కాడె శంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలక ఆంజనేయులు, చొప్పదండి నియోజకవర్గం ఇంచార్జ్ కునమల్ల చంద్రయ్య, మానకొండూర్ ఇంచార్జ్ లింగంకుమార్, హుజూరాబాద్ ఇంచార్జ్ జిల్లా జూపాక శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్ ఇరుకుల యాదగిరి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాల మహానాడు సోషల్ మీడియా కోఆర్డినేటర్ జవ్వాజి అజయ్, చొప్పదండి టౌన్ ప్రెసిడెంట్ సంబోజి సునీల్, వైస్ ప్రెసిడెంట్ కనుమల్ల చందు గుంటపల్లి రవీందర్,తాళ్ల అంజయ్య సురేష్,దిలీప్, ప్రవీణ్,న్యాత రాజేందర్, యాలాల రమేష్,లింగం కుమార్, దొంత కనకయ్య ,సుంకె కిరణ్,కర్ర మణికంఠ,రొడ్డా మహేష్ ,రొడ్డా చంద్రశేఖర్,మాషం అనిల్, ఎలుక ప్రేమ్ చంద్,రోడ్డ అశ్రిత్ గాజుల ధర్మేందర్, మల్లం అనిల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
