భద్రాచలం నేటి ధాత్రి
సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు అల్లాడి పౌల్ రాజ్
ముంపు మండలాల ఇన్చార్జ్ డేగల వంశీ
భద్రాచలం స్థానిక ఆదర్శ్ నగర్ కాలనిలో పట్టణ అధ్యక్షుడు డేగల శివ అధ్యక్షతన మాల మహానాడు కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది
ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు అల్లాడి పౌల్ రాజ్ హాజరై కార్యమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఈ రోజు ఆదర్శ్ నగర్ కాలనిలో మాల మహానాడు సమావేశం నిర్వహించడం ఆనందంగా ఉందని మన మాలలు ఐకమత్యం కొరకు భద్రాచలం లోని అన్ని కాలనిలో నియోజకవర్గ స్థాయిగా విసృతంగా సమావేశాలు జరుపుతామని జిల్లా హెడ్ క్వార్టర్ లో త్వరలోనే బారి జన సమూహం తో మాలల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం చేపడతామని కొన్ని రాజకీయ అగ్ర కులాలు మాలల ను చిన్న చూపు చూస్తున్నాయి అని రాబోవు రోజుల్లో వారికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమానికి ముంపు మండలాల మాల మహానాడు ఇంచార్జ్ డేగల వంశీ హాజరై కొన్ని రాజకీయ అగ్ర కులాలు మాలలను అణచవేయబడే కుట్ర జరుగుతావుంది కాబట్టి మనమందరం ఏకమవ్వాల్సిన అవసరం ఉంది రాబోవు రోజుల్లో అనేక కార్యక్రమాలు చేపట్టి మన మాలల సమస్యల ను తీర్చడానికి మాల మహానాడు అండగా ఉంటుందని వారికి భరోసా ఇవ్వడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఆదర్శ్ నగర్ కాలని మాల మహానాడు మహిళా నాయకులు తుమ్మల రాణీ, డేగల వెంకటమ్మ,దాసరి సామ్రాజ్యం, పల్లంటి లక్ష్మి, రాయిపూడి లక్ష్మి, మద్దెల నాగమణి, అల్లాడి సుధ,జయ,సునీత, కమిటీ మెంబర్లు, బట్టూ కుమార్, అల్లాడి వెంకటేశ్వర్లు,సంతోష్, తుమ్మల కృష్ణ, బొరుగడ్డ గోపి, సారంగి అర్జున్, దాసరి భాస్కరరావు, బట్టూ ఎడ్విన్,అల్లాడి బాలరాజు, డేగల వెంకటేశ్వర్లు,సతీష్,నందిబాబు, తదితరులు పాల్గొన్నారు..