
ఎండపల్లి. నేటి ధాత్రి
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రంలో మాల సంఘం కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా గౌరి ప్రభాకర్ ని ఎన్నుకోగా ఉపాధ్యక్షులుగా దేవి నర్సయ్య (బాబు ), ప్రధాన కార్యదర్శి ఆల్క లచ్చయ్య, కార్యదర్శి అనే శ్రీనివాస్, కోశాధికారిగా అనే మల్లయ్య,కార్యవర్గ సభ్యులుగా దేవి చుక్కయ్య, దేవి భీమయ్య లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా అధ్యక్షులు గౌరి ప్రభాకర్ మాట్లాడుతూ.మాల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక పట్ల కృషి చేసిన కుల బందువులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మాల సంఘం అభివృద్ధికై కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో దేవి భీమయ్య,కనకయ్య, మేసు భీమయ్య,అనే శంకరయ్య,దేవి చిన్నయ్య,దేవి ప్రవీణ్,దేవి విక్కీ,గౌరి చిరంజీవి,దేవి రవీందర్,మేసు ప్రదీప్,మనోజ్ కుమార్,దేవి మహేష్,దేవి చందు, దేవి వెంకటేష్, దేవి నగేష్,దగ్గుల చందు జూపాక నరేష్,పిట్ట స్వామి,దేవి పోచయ్య,దేవి అనిల్, ఆల్క ప్రశాంత్,దేవి చంద్రక్రాంత్ ఆల్క బాబు,ఆల్క పతి మహిళలు కుల సభ్యలు తదితరులు పాల్గొన్నారు.