
Shadnagar Raikal Toll Plaza.
మక్తల్ ఎమ్మెల్యే వాహనానికి ప్రమాదం
ఎమ్మెల్యే శ్రీహరి కారును ఢీకొన్న మరో కారు
తృటిలో తప్పిన ప్రమాదం
మహబూబ్ నగర్ /నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా మక్తల్
ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కు ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుండి మహబూబ్ నగర్ వైపుతో వెళ్తున్న TG 38. 6669 నెంబర్ గల ఇన్నోవా కారును పక్కన నుండి వస్తున్న ఐ 20 కారు వేగంగా ఢీకొట్టింది. షాద్ నగర్ రాయికల్ టోల్ ప్లాజా వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో ఎమ్మెల్యే కారుకు స్వల్పంగా ధ్వంసం కాగా ఎవ్వరికి ఎలాంటి గాయాలు కాలేదనీ ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.