రామకృష్ణాపూర్, మార్చి29, నేటిధాత్రి:
రామకృష్ణాపూర్ పట్టణంలోని హరి హర క్షేత్రమైన శ్రీ కోదండ రామాలయంలో సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని రాములోరి తలంబ్రాల కోసం ఆలయ ప్రధాన అర్చకులు పనిభట్ల అంబా ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా మాతల చేత వడ్లను గోటితో వలిచి అక్షంతలు తయారు చేశారు. అనంతరం ఆలయ కమిటీ కార్యక్రమంలో పాల్గొన్న మాతలకు ప్రసాదాలు అందజేశారు.