నేటి సమ్మెను విజయవంతం చేయండి

నేటి సమ్మెను విజయవంతం చేయండి

ముత్తారం :- నేటి ధాత్రి

ప్రభుత్వ వైఖరికి నిరస నగా ఈనెల 20న నిర్వహించ తల పెట్టిన ఒక రోజు దేశవ్యాప్త సమ్మె ను విజయవంతం చేయాలని కెమి స్ట్స్, అండ్ డ్రగ్గిస్ట్స్ వెల్ఫేర్ అసోసి యేషన్ మండల అధ్యక్షుడు గడ్డం శ్రీధర్, ప్రధానకార్యదర్శి కాసు తిరుపతి పిలుపునిచ్చారు. బంద్ కు సంబంధించిన కరప త్రాన్ని మంగళ వారం ముత్తారం తహసిల్దార్ మధుసూదన్ రెడ్డి ,ఎస్సై రవి కుమార్ కు అందజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సమర్పించిన వినతి పత్రంలో, ఫార్మసీ రంగాన్ని తీ వ్రంగా ప్రభావితం చేస్తున్న కీలక సమస్యలపై విజ్ఞప్తులు చేశామన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టమైన చర్యలు తీసుకోలేదని తెలిపారు. కార్పొరేట్ సంస్థలు ఇచ్చే భారీ డిస్కౌంట్లు మార్కెట్ సమతుల్యతను దెబ్బతీస్తున్నాయన్నారు. కొవిడ్ కాలంలో జారీ చేసిన తాత్కాలిక నోటిఫికేషన్ జీఎస్ఆర్ 220(ఈ)ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్త సమ్మెకు తమ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా సహకరించాలని అధికారులను కోరారు .ఈ కార్యక్రమంలో కె.వి చారి, ముస్కే సదానందం, వేముల హుస్సేన్ ,నిమ్మతి రాజేందర్ ,సంపూర్ణ చారి, జంగా రవికుమార్ సభ్యులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version