ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి నియోజకవర్గంలోని రేగొండ, గణపురం మండలాలతో పాటు భూపాలపల్లి పట్టణంలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పర్యటించనున్నారని, ఇట్టి పర్యటనను విజయవంతం చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. శుక్రవారం భూపాలపల్లిలో ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భూపాలపల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన, వంద పడకల ఆసుపత్రిలో రివ్యూ, అంబేద్కర్ సెంటర్ లో ప్రజా పాలన విజయోత్సవ సభ(పబ్లిక్ మీటింగ్) కు మంత్రులు రానున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీఎస్సార్ మంత్రులిద్దరి షెడ్యూల్ ను మీడియాకు వివరించారు.ఉదయం 11 గంటలకు మంత్రులిద్దరూ హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్ పోర్టు నుండి ప్రత్యేక చాపర్ లో బయలుదేరుతారు.
ఉదయం 11:40 గంటలకు రేగొండ మండలం రామన్నగూడెం గ్రామ శివారులో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన హెలీ ప్యాడ్ వద్ద దిగి, అక్కడి నుండి మధ్యాహ్నం 12 గంటలకు భాగిర్ధిపేట ఆర్చి వద్ద రూ.50 కోట్లతో ఏర్పాటు చేసిన బుద్దారం – కొడవటంచ గ్రామం వరకు బీటీ డబుల్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ మరియు సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 12:15 గంటలకు భూపాలపల్లిలో రూ.15 కోట్లతో 50 పడకల ఆయూష్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
మధ్యాహ్నం 12:30 గంటలకు రూ.130 కోట్లతో మెడికల్ కాలేజీ బిల్డింగ్ కాంప్లెక్స్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 12:45 గంటలకు రూ.13 కోట్లతో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 3వ అంతస్తులో గదుల నిర్మాణం పనులకు శంకుస్థాపన అనంతరం మొగుళ్ళపల్లి మండలానికి 108 అంబులెన్స్ ను ప్రారంభిస్తారు. అనంతరం అక్కడే డాక్టర్లతో రివ్యూ మీటింగ్ నిర్వహిస్తారు.
మధ్యాహ్నం 1:30 గంటలకు రూ.4 కోట్లతో భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్ నుండి కేటీకే 2 ఇంక్లైన్ వరకు బీటీ రోడ్డు మరియు సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 1:45 గంటలకు భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్ లో ప్రజా పాలన విజయోత్సవ సభ(పబ్లిక్ మీటింగ్)లో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుండి బయలుదేరి హైదరాబాద్ కు వెళ్లనున్నారు.
కావున, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్ వర్కింగ్ పిప్పాల రాజేందర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు అప్పం కిషన్ కౌన్సిలర్లు దాట్ల శ్రీనివాస్ ముంజాల రవీందర్ గురుమిళ్ళ శ్రీనివాస్ జిల్లా నాయకులు బుర్ర కొమురయ్య కోమల మాలతి కాంగ్రెస్ శ్రేణులు, అధికారులు, మీడియా మిత్రులు పాల్గొని సక్సెస్ చేయాలని ఎమ్మెల్యే కోరారు.