
పివైఎల్ రాష్ట్ర కార్యదర్శి వాంకుడోత్ అజయ్
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సిన నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్( నీట్) ద్వారా ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులు చేయుటకు అర్హతగా నిర్వహించాల్సిన పరీక్ష పేపర్ లీక్ చేసి విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం ఆటలాడుతుందని ప్రగతిశీల యువజన సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వాంకుడోత్ అజయ్ అన్నారు . నీట్ పరీక్షలను మళ్లీ నిర్వహించాలని,ఎన్టిఏను రద్దు చేయాలని ,నీట్ పరీక్షలు నిర్వహించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఇవ్వాలని తదితర డిమాండ్ల సాధన కొరకు దేశవ్యాప్తంగా విద్యార్థి, యువజన సంఘాలు జులై 4వ తేదీన భారత్ బంద్ చేయాలని నిర్ణయించాయని, బంద్ విజయవంతనికి ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు సహకరించాలని వారు కోరారు. భారత్ బంద్ లో విద్యార్థి, యువజన సంఘాల నాయకులు చురుకైన పాత్ర పోషించాలని వారు పిలుపునిచ్చారు.