
జులై 9 జరిగే కార్మికుల సమ్మె విజయవంతం చేయండి
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలంలోని బుద్దారం గ్రామ పంచాయతీ సిబ్బంది తో జులై 9 న జరిగే దేశ వ్యాప్త కార్మికుల సమ్మె లో పాల్గొని విజయవంతం చేయుటకు, సమ్మె ఎందుకో వివరిస్తున్న సిఐటియు మండల కార్మిక నాయకులు దాసరి నితీష్, బోడ నర్సింగ్, ఈ కార్యక్రమం లో బుద్దారం గ్రామ పంచాయతీ కార్మిక నాయకులు బొచ్చు భద్రయ్య, సోమిడీ సమ్మక్క, సుధాకర్ రావు, కొలిపాక సులోచన, బొచ్చు రజిత, నిర్మాణ కార్మికులు దాసరి అజయ్, బోడ సయ్యయ్య తదితరులు పాల్గొన్నారు.